
అరెస్టును ఖండిస్తూ మోకాళ్లపై నిరసన
అమలాపురం రూరల్: ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టును ఖండిస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం జనుపల్లిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని, మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఆరోపణలు తప్ప, ఆధారాల్లేకుండా కూటమి ప్రభుత్వం మిథున్‌రెడ్డిపై కేసులు పెట్టిందని రమేష్ ఆరోపించారు. విద్యార్థి విభాగం నాయకులు పెయ్యాల సాయి, బడుగు మోహన్, వరసల సుజిత్, విన్సీ, సాగర్, ఆనంద్, రవికుమార్, సల్మాన్‌రాజ్ పాల్గొన్నారు.