
ఫ మనసారె దీవించమ్మా..
‘చల్లని తల్లీ.. మా కల్పవల్లీ.. మమ్మల్ని మనసారా దీవించమ్మా’ అంటు వందలాది మంది భక్తులు పాదయాత్రగా భారీ సారె తీసుకుని వచ్చి.. అమ్మవార్లకు సమర్పించారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరీదేవి, అష్టాదశ శక్తి పీఠాల్లో పదో పీఠం దేవత అయిన శ్రీ పురుహూతికా అమ్మవార్లకు మండలంలోని విరవ గ్రామానికి చెందిన శ్రీ పద్మావతీ శ్రీవారి సేవా సంఘం సభ్యులు ఏటా ఆషాఢ మాసంలో సారె సమర్పిస్తూంటారు. దీనిలో భాగంగా వారు తమ ఇళ్లల్లో స్వయంగా వండిన పిండివంటలు, స్వీట్లతో పాటు పండ్లు, పువ్వులు, ఇతర పదార్థాలతో సారె సిద్ధం చేశారు. పాదగయ దేవస్థానం ఈఓ కాట్న జగన్మోహన్ శ్రీనివాస్ దంపతులు ఈ సారెను ఆదివారం ముత్తయిదువల తలకు ఎత్తగా.. వారు అమ్మవారి నామ స్మరణ చేసుకుంటూ విరవాడ, ఎఫ్‌కే పాలెం, కందరాడ, కుమారపురం మీదుగా పాదగయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆ సారెకు ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
– పిఠాపురం

ఫ మనసారె దీవించమ్మా..