
కర్నీడి చంద్రమ్మ (ఫైల్)
అంబాజీపేట: ఇరుసుమండకు చెందిన శతాధిక వృద్ధురాలు కర్నీడి చంద్రమ్మ (105) సోమవారం మృతి చెందారు. ఆమెకు కుమార్తె, కుమారుడు, తొమ్మిది మంది మనుమలు, మనుమరాళ్లు, 19 మంది మునిమనుమలు, మునిమనుమరాళ్లు ఉన్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
రంగంపేట: ఓ వ్యక్తి పామాయిల్ తోటలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఏఎస్సై కె.నూకరాజు కథనం ప్రకారం.. జి.దొంతమూరుకు చెందిన నల్ల భద్రం (59) తంగేటి వెంకటేశ్వరరావుకు చెందిన పామాయిల్ తోటలో గెలలు కోయడానికి శనివారం ఉదయం వెళ్లాడు. అప్పటి నుంచీ ఇంటికి రాలేదు. సోమవారం మధ్యాహ్నం వరకూ వేచి చూసిన కుటుంబ సభ్యులు పామాయిల్ తోటలోకి వెళ్లి చూడగా అల్యూమినియంతో చేసిన పొడవాటి కత్తితో పామాయిల్ గెలలు కోస్తూ తోటలో విద్యుత్తు వైర్లు ఉన్నచోట కింద పడి మృతి చెంది కనిపించాడు. భద్రం కుటుంబ సభ్యుడు నల్ల లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైం కార్నర్