సొంత భూమితోపాటు కౌలు తీసుకున్న దానితో కలిపి మొత్తం 10 ఎకరాలు వరి పంట సాగు చేశాను. ఇటీవల కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం రాలిపోయింది. చేనులోనే రాలిపోయిన గింజలను చూస్తే ప్రాణం తరుక్కుపోతుంది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాను. – పాపన్న, రైతు, మాన్‌దొడ్డి
ఉన్నతాధికారులకు పంపాం..
అకాల వర్షానికి జిల్లాలో ఎక్కువగా రాజోళి మండలంలోని మాన్‌దొడ్డి పరిసర గ్రామాలు, అయిజ మండలంలో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఎక్కువగా వరి పంట చేతికి రాని విధంగా తయారైంది. పంటలో జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాం. – వీరప్ప, డీఏఓ
●


