అలంపూర్: ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని డీసీహెచ్‌ఎస్ రమేష్‌చంద్ర అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలోని ఏరియా ఆస్పత్రిలో పీహెచ్‌సీ వైద్యాధికారులు, పీఓ ఎంసీహెచ్ సర్వీసెస్, ఏరియా ఆస్పత్రి సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియా ఆస్పత్రిలో మదర్ అండ్ చైల్డ్ కేర్ సర్వీసెస్ మరింత మెరుగుపర్చాలన్నారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. చికిత్స కోసం వచ్చే వారికి డైట్ సర్వీసెస్ అందించడం జరుగుతుందన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహ ణ మెరుగుపర్చాలన్నారు. జనరల్ సర్జరీలు, ఆప్త మాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ సేవలను ఆస్ప త్రిలో అందిస్తున్నట్లు వివరించారు. ఆరోగ్యశ్రీలో జనరల్ సర్జరీలో అప్రెంటిక్స్ ఫిస్టులా శరీరంలో కంతులు రొమ్ములో కంతులు థైరాయిడ్ సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ సయ్యద్ బాష, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసన్న, డాక్టర్లు నిఖిల, సుహానా, ఆనస్తీషియా గిరిభాస్కర్, వైద్య సిబ్బంది సుబ్బలక్ష్మి, త్రివేణి పాల్గొన్నారు.


