జిల్లావ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తు, యువతను ప్రగతి వైపునకు తీసుకురావాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గద్వాలను గంజాయి రహిత జిల్లాగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వారం రోజులపాటు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బాల్య వివాహాల వల్లన జరిగే సమస్యలు, మహిళలపై వేధింపులు, దాడులకు విధించే శిక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరుస్తున్నాం. – టి శ్రీనివాసరావు, ఎస్పీ
●


