అంజన్న నామస్మరణతో మారుమోగిన బీచుపల్లి | - | Sakshi
Sakshi News home page

అంజన్న నామస్మరణతో మారుమోగిన బీచుపల్లి

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి నామస్మరణతో మారుమోగింది. ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజైన శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి, చౌకిసేవ, బలిహరణం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలలో భాగంగా మొదటి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలను ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. దాసంగాలతో మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం వండి ఆంజనేయస్వామికి సమర్పించారు. అనంతరం ద్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల కొనుగోళ్లతో ఆలయాల పరిసరాల్లో వెలసిన వివిధ దుకాణాలు రద్దీగా మా రాయి. కార్యక్రమంలో ఈఓ పురేందర్‌ కుమార్‌, అర్చకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement