రాయితీ.. అనాసక్తి! | - | Sakshi
Sakshi News home page

రాయితీ.. అనాసక్తి!

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

–8లో u

గద్వాలన్యూటౌన్‌: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుదారులకు కల్పించిన 5శాతం రాయితీకి ఆదరణ కరువైంది. ఇందుకు నెలరోజుల సమయం ఉన్నా.. చాలా తక్కువ మంది మాత్రమే ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌లో ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు సైతం దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ఆశించిన స్పందన రాలేదు. నాలుగు మున్సిపాలిటీల్లో ఓ మోస్తారుగా మాత్రమే ఆస్తిపన్ను చెల్లించారు.

ప్రచారం చేసినా ఫలితం శూన్యం..

జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఉన్న నివాసగృహాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తదితర వాటి నుంచి ప్రతి ఏడాది ఆస్తిపన్ను వసూలు చేస్తారు. అయితే ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలలపాటు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, బిల్‌ కలెక్టర్లు బృందాలుగా ఏర్పడి పన్ను వసూలు చేపట్టారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు గత ఆర్థిక సంవత్సరం (2025–26) పన్నుల వసూలులో లక్ష్యాన్ని చేరుకోలేదు. 60 నుంచి 70 శాతానికి చేరుకోవడానికి సైతం తడబడ్డాయి. తాజాగా మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ.. ఏప్రిల్‌లో ముందస్తుగా పన్ను చెల్లించే వారికి రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది మొత్తం చెల్లించాల్సిన పన్నులో 5శాతం మినహాయిస్తామని ప్రకటించింది. ఇందుకు పట్టణాల్లో ప్రచారం కోసం ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. బిల్‌ కలెక్టర్లు కాలనీల వారీగా అవగాహన కల్పించారు. అయినప్పటికీ ప్రజల నుంచి మాత్రం స్పందన అంతగా రాలేదని చెప్పవచ్చు.

మున్సిపాలిటీల్లో ముందస్తుఆస్తిపన్ను వసూలు అంతంతే

5శాతం రాయితీతో నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

జిల్లాలోని నాలుగు పురపాలికల్లోఓ మోస్తారుగా మాత్రమే చెల్లింపు

ఫలించని అధికారుల ప్రచారం

Advertisement
 
Advertisement
Advertisement