నిత్యం వాటర్‌ట్యాంకు నుంచి బిందెలతో నీరు తెచ్చుకుని ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్నా. ఈ క్రమంలో గుండెలో సమస్య ఏర్పడింది. అలాగే పనికి వెళ్లడంతో అక్కడే పడిపోయాను. గ్రామస్తులు ఇంటికి చేర్చారు. మాలాంటి వారు ట్యాంకు నుంచి నీరు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నీటి వసతి కల్పించాలి. – లక్ష్మక్క,
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు, ముండ్లదిన్నె
ఇబ్బంది పడుతున్నాం..
ఇల్లు మంజూరైందని సంతోషపడాలో.. లేక క్యూరింగ్ చేసుకునేందుకు నీటి కష్టాలు తప్పడం లేదని బాధపడాలో తెలియడం లేదు. కొళాయి ద్వారా నీరు పట్టుకునేందుకు వీలు లేకుండా చేశారు. కాని కొందరి ఇళ్లకు మాత్రం ప్రత్యేకంగా కొళాయిలు ఏర్పాటుచేశారు. ట్యాంకుల నుంచి రోజూ ఉదయం, సాయంత్రం నీరు తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు నీరు అందించే ఏర్పాటుచేస్తే బాగుంటుంది. – నాగేశ్వరమ్మ,
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు, ముండ్లదిన్నె
క్షేత్రస్థాయిలో నిఘా ఉంచుతాం
మిషన్ భగీరథ ద్వారా ఇంటి నిర్మాణాలకు నీరు ఇవ్వలేం. కానీ కొందరు నర్సరీలు, ఇళ్లకు ప్రత్యేకంగా నల్లాలు ఏర్పాటుచేశారని సమాచారం. ఈ విషయమై గ్రామ పంచాయతీ అధికారులు, మండల అధికారులకు క్షేత్రస్థాయిలో నిఘా ఉంచమని చెబుతాం. అలాంటి వాటికి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయి.
– శ్రీధర్‌రెడ్డి, మిషన్ భగీరథ డీఈ
●


