‘ఇందిరమ్మ’కు నీటి కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’కు నీటి కష్టాలు!

May 1 2026 5:57 AM | Updated on May 1 2026 5:57 AM

రాజోళి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరైందని సంతోషించే లోగా రాజకీయ కారణాలతో తమ పేరు మొదటి విడతలో వస్తుందా లేదా అనే ఆందోళన చెందారు. తీరా ఇల్లు మంజూరై నిర్మాణం ప్రారంభించాక తలెత్తుతున్న ఇబ్బందులతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా చాలా గ్రామాల్లో తాగునీటి కొరత ఉందనే సాకుతో నల్లా నీటిని ఇళ్ల నిర్మాణాలకు వినియోగించనివ్వడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణానికి క్యూరింగ్‌ చేసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.

సరిపోని సాయం.. తప్పని అప్పులు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందించే రూ. 5లక్షల సాయం సరిపోకపోయినా.. లబ్ధిదారులు అప్పులుచేసి మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం కోసం బోరుబావి డ్రిల్లింగ్‌, విద్యుత్‌మోటారు ఏర్పాటు లబ్ధిదారులకు అయ్యే పని కాకపోవడంతో నల్లా నీటిపైనే ఆధారపడుతున్నారు. అయితే వేసవిలో తాగునీటి కొరత సాకుతో ప్రజాప్రతినిధులు, అధికారులు మిషన్‌ భగీరథ నీటిని ఇంటి నిర్మాణాలకు వినియోగించొద్దని లబ్ధిదారులకు తేల్చిచెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఏకంగా ఇందిరమ్మ ఇళ్లకు మిషన్‌ భగీరథ నీటిని వినియోగించే వారి నల్లా కనెక్షన్‌ కట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు గత సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్ర భుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలకు మోకాలడితే ఎలా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

ఇళ్ల నిర్మాణాలక్యూరింగ్‌కు అవస్థలు

గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటినివినియోగించుకోనివ్వని వైనం

బిందెలతో నీటిని

తెచ్చుకుంటున్న లబ్ధిదారులు

ఇళ్ల నిర్మాణాల పూర్తిపై నీలినీడలు

Advertisement
 
Advertisement
Advertisement