గద్వాల: జనగణన–2027 ప్రక్రియను సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింద ని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జనగణనలో భాగంగా మంగళవారం ఆ యన తన చాంబర్‌లో స్వీయ గణన నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతి పౌరుడు మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషా ల వ్యవధిలో పూర్తిచేసుకోవచ్చని తెలిపారు. వివరాల నమోదు అనంతరం సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ జారీ చేయడం జరుగుతుందని.. ప్రభు త్వం నియమించిన ఫీల్డ్ ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చిన సమయంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ నంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే ధ్రువీకరణ సమయంలో వారు ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌లో నమోదుచేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధ్రువీకరిస్తారన్నారు. తద్వారా ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండేవారు, విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణాల్లో ఉన్న ప్రజలు కూడా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. అయితే స్వీయ గణనలో కచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలన్నారు. జనగణన ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమగ్రతను పెంచడం.. ప్రతిపౌరుడి వివరాలు నమోదు చేసేలా చూ డటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో సీపీఓ పాపయ్య పాల్గొన్నారు.
● వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖతో పాటు రెడ్‌క్రాస్ సంస్థ సహకారంతో స్థానిక రెండవ రైల్వే గేట్ సమీపంలో ఉన్న పాతసాయుధ దళాల కార్యాలయ ప్రాంగణంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ కార్యాలయం పక్కన డే కేర్ సెంటర్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సెంటర్‌లో రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల వరకు వృద్ధులకు మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ, అల్పాహార సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో సెంటర్‌ను మూసివేయనున్నట్లు చెప్పారు. అర్హులైన వృద్ధులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99494 63238 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
స్వీయ నమోదు అవకాశాన్నిసద్వినియోగంచేసుకోవాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్


