గద్వాల క్రైం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. స్థాని క భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులై విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నా రు. వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు భరోసా కేంద్రం నిర్వాహకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు ప్రజావాణికి 13 ఫిర్యాదులు..
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ గ్రామాలకు చెందిన 13మంది తమ సమస్యలపై ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించారు.


