● ఎక్కడైనా అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే మంటలను ఆర్పివేసేందుకు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి.
● ఐఎస్‌ఐ మార్క్ కలిగిన ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగించాలి.
● కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలను పూర్తిగా ఆర్పివేయాలి.
● సెల్లార్లలో ఆటోమెటిక్ స్ప్రింక్లర్లను అమర్చుకోవాలి.
● వంటగదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్లు ఉంచొద్దు.
● స్కూల్, షాపింగ్ మాల్స్, ఆస్పత్రుల్లో కాంక్రిట్ స్లాబ్‌లను మాత్రమే పైకప్పుగా వాడాలి.
● గ్రామాల్లో గడ్డివాములను నివాసగృహాలకు కనీసం 60 అడుగుల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. పూర్తిగా ఎండిన గడ్డిని మాత్రమే నిల్వ చేసుకోవాలి.
● గుడిసెకు గుడిసెకు 30 అడుగుల దూరం ఉండాలి.
ప్రమాదాల నియంత్రణకు కృషి..
అగ్నిప్రమాదాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్నాం. ఒడిదుడుకులను ఎదుర్కొటూ విపత్తులను అధిగమిస్తున్నాం. ప్రమాదాలు చోటు చేసుకున్న క్రమంలో అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. జిల్లాలో రెండు ఫైర్‌స్టేషన్ల ద్వారా సేవలను అందిస్తున్నాం. ఇంకా అవసరమైన మౌలిక వసతులు, సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేశాం.
– అశోక్, జిల్లా అగ్నిమాపక అధికారి
●


