పకడ్బందీగా నిర్వహిస్తాం..
నమోదు ఇలా..
–8లో u
గద్వాలన్యూటౌన్: జనగణన–2027లో భాగంగా స్వీయ నమోదు ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్, యాప్ ద్వారా మే 10వ తేదీ వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారు. జనగణన మొదటి దశలో చేపట్టే ఇళ్ల లెక్కింపును 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
మొదటి దశలో ఇళ్ల గణన..
ప్రభుత్వం పదేళ్లకోసారి జనగణన నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా 2011లో జనాభాను లెక్కించారు. ఆ తర్వాత 2021లో కరోనా, ఇతరత్రా కారణాలతో జనగణన ప్రక్రియ ముందుకుసాగలేదు. 2027లో డిజిటల్‌గా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జనగణనకు ఇళ్ల లెక్కింపు కీలకమైనది. ఇళ్ల గణన ద్వారా నివాసాల స్థితిగతులు, మౌలిక వసతులపై కచ్చితమైన సమాచారం సేకరించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మొదటి దశలో ఇళ్ల గణన కోసం గ్రామీణ ప్రాంతాల్లో 130 నుంచి 150, పట్టణ ప్రాంతాల్లో 230 నుంచి 250 నివాసగృహలతో హౌసింగ్ లిస్టింగ్ బ్లాక్స్ (హెచ్‌ఎల్‌బీ)గా ఏర్పాటుచేశారు. బ్లాక్ వారీగా ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్తారు. ఈ గణనలో ఇంటి నిర్మాణ స్వభావం, యజమాని వివరాలు, ఇంటిలో ఉండే మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్, వంటగ్యాస్, మరుగుదొడ్డి, డ్రెయినేజీ.. ఇలా మొత్తం 33 వివరాలను సేకరిస్తారు. ఇళ్ల గణనతో ప్రభుత్వానికి విద్య, వైద్యం, రహదారులు, ఇళ్లు వంటి అంశాల్లో స్పష్టత వస్తుంది. దీన్ని ఆధారంగా సంక్షేమ పథకాల రూపకల్పన చేస్తుంది.
జిల్లాలో హెచ్‌ఎల్‌బీలు : 1,071
ఎన్యూమరేటర్లు : 1,087
సూపర్‌వైజర్లు : 191
ఇళ్ల గణన పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఇప్పటికే గణన అధికారులకు శిక్షణ అందించాం. సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. స్వీయ గణనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అదే విధంగా క్షేత్రస్థాయి గణనలో భాగంగా ఇళ్లకు వచ్చే గణన అధికారులకు ప్రజలు వివరాలు తెలియజేసి, సహకరించాలి.
– పాపయ్య, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి
జిల్లాలో మొదలైన జనగణన ప్రక్రియ
మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం
11నుంచి జూన్ 9 వరకు క్షేత్రస్థాయి పరిశీలన, నమోదు
ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
స్వీయ గణన నమోదు కోసం https://se.-ce nsus.gov.i n లింక్ ఓపెన్ చేసి.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ (హెచ్‌ఎల్‌ఓ) స్వీయగణన లాగిన్ వద్ద తెలంగాణ ఎంపిక చేయాలి. ఆ తర్వాత captcha ఎంటర్ చేసి, వెరిఫై, ప్రొసీడ్ క్లిక్ చేయాలి. అప్పుడు వెల్‌కం పేజీ డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడి నుంచి మూడు స్టెప్‌లలో అడిగిన వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ఏతో ప్రారంభమయ్యే 11 అంకెల ఐడీ వస్తుంది. ఈ ఐడీని నోట్ చేసుకోవాలి. మే 11 తర్వాత ఇంటికి వచ్చే గణన అధికారి (ఎన్యూమరేటర్)కు చూపిస్తే ఆయన అఫ్రూవ్ చేస్తారు.


