ఇందిరమ్మ ఇళ్ల పథకం.. పేదలకు వరం | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల పథకం.. పేదలకు వరం

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

ధరూరు: నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఓ వరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ధరూరు మండలం ఓబులోనిపల్లిలో పద్మమ్మ – చిన్నజమ్మన్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించి.. లబ్ధిదారుకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఇదివరకే 1,500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రెండో జాబితా విడుదలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌, మాజీ వైస్‌ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, శేఖర్‌, నాగన్న, సురేశ్‌, పాండు పాల్గొన్నారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు

అలంపూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని ఎమ్మెల్యే విజ యుడు అన్నారు. బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ఫీజుల పోరుబాట పోస్టర్లను ఆదివారం అలంపూర్‌ చౌరస్తాలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం.. 13లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయకపోవడం దారుణమన్నారు. వి ద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ జిల్లా కోఆర్డినేటర్‌ కుర్వ పల్లయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కిషోర్‌ కుమార్‌, రఘురెడ్డి, నర్సింహ, మాధవ్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి ‘రైతు

ముంగిట్లో శాస్త్రవేత్తలు’

గద్వాలవ్యవసాయం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి మే 23వ తేదీ వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించనున్నట్లు క్లస్టర్‌ ఇన్‌చార్జి, శాస్త్రవేత్త డా.శంకర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి, 40 గ్రామాల్లో రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఉద్యాన, పశుసంవర్ధకశాఖ అధికారులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.

పాలిటెక్నిక్‌లో

ప్రవేశాలకు దరఖాస్తులు

వనపర్తిటౌన్‌: హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో అనాథ బాలికల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడౠ్ల్యఓ కె.సుధారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన అనాథలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన, అక్రమ రవాణా బాధిత బాలికలు ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా కళాశాలలో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. డీసీఈ, డీఈఈఈ, డీసీఎం, డీఈసీఈ, డిప్లొమా ఇన్‌ సెమీ కండక్టర్‌ టెక్నాలజీ. డిప్లొమా ఇన్‌ ల్యాడ్‌స్కేప్‌ డైసైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (అనాథ బాలికలకు అవసరం లేదు), అనాథ బాలికలు తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, డిక్లరేషన్‌/బోనఫైడ్‌ సర్టిఫికేట్‌, టీసీ, స్టడీ సర్టిఫికేట్‌, పదోతరగతి మార్కుల మెమో (కౌన్సిలింగ్‌ సమయంలో సమర్పించాలి), 2 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో మే నెల 25వ తేదీలోగా దరఖాస్తులను మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 84659 57488, 96037 24113 లేదా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ)లో సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement