వాసవీమాతకు ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

వాసవీమాతకు ప్రత్యేక పూజలు

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

గద్వాలన్యూటౌన్‌: జిల్లా కేంద్రంలోని కన్యాకా పరమేశ్వరిదేవి ఆలయంలో ఆదివారం వాసవీమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సామూహిక క్షీరాభిషేకాలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా హోమం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉరేగింపు చేపట్టగా.. మహిళలు, చిన్నారుల కోలాటాలు, పోతరాజుల విన్యాసా లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బిలకంటి రాము, ప్రధానకార్యదర్శి నరహరి శ్రీనివాసులు, కోశాధికారి పత్తి రత్నాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement