నాకు మూడెకరాల మామిడి తోట ఉంది. ఏటా కాపు బాగానే వస్తోంది. ఈ ఏడాది పూత, పిందెలు రాలి కొంత దిగుబడి తగ్గింది. అయితే ధరలు బాగానే ఉన్నాయి. మా ప్రాంతంలో చాలా మంది రైతులు పండ్ల తోటలపై ఆసక్తి కనబరుస్తున్నారు.
– కొండయ్య, మామిడి రైతు, కేటీదొడ్డి
రెండున్నరెకరాల్లో సాగు..
నేను రెండున్నర ఎకరాల్లో బత్తాయి తోట సాగుచేస్తున్నా. మా ప్రాంతంలోని నేలలకు పండ్ల తోటలు బాగా వస్తున్నాయి. వాతావరణం కూడా అనుకూలంగానే ఉంటోంది. ఈఏడాది దిగుబడులు బాగానే వచ్చాయి. ప్రస్తుతం బత్తాయి ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. – మనోహర్‌రెడ్డి, బత్తాయి రైతు,
షాబాద్, ఇటిక్యాల మండలం
రైతులను ప్రోత్సహిస్తున్నాం..
పండ్లతోటలకు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇక్కడి రైతులు ఆసక్తి చూపుతున్నారు. పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను ఉద్యానశాఖపరంగా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకు సంబంధించి పథకాల అమల్లో అర్హులైన రైతులను గుర్తించి.. వారికి ప్రోత్సాహకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖాధికారి
●


