ఘనంగా శేషదాసుల ఆరాధనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శేషదాసుల ఆరాధనోత్సవాలు

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

మల్దకల్‌: మండల కేంద్రంలో శేషదాసుల ఆరాధనోత్సవాలు శనివారం ముగిసాయి. శేషదాసుల వంశస్తులు ధీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, శశాంకల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక భజనల చేశారు. దాసుల చరిత్రను వేదపండితులు వివరించారు. ఉత్సవాలకు గ్రామీణ భక్తులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అరవిందరావు, బాబురావు, చంద్రశేఖర్‌రావు, ముకుందరావు, అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి, శ్రీకాంత్‌ జోషి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement