అలంపూర్: ప్రజల దాహం తీర్చాలనుకోవడం గొప్ప సంకల్పమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలో పుల్లూరు గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుల్లూరు పంచాయతీ ద్వారా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీతమ్మ, ఉపసర్పంచ్ అబ్దుల్ నబీ, కార్యదర్శి శ్రీనివాసులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చలువపందిళ్ల పరిశీలన :
అలంపూర్ చౌరస్తాలోని నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. వేసవి ఎండలు తీవ్రమవడంతో కలెక్టర్ పంచాయతీ తరుఫున చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. దీంతో అలంపూర్, అయిజ, గద్వాల, కర్నూలు రోడ్డు మార్గాల్లో నాలుగు చోట్ల ప్రయాణికులు బస్సులు ఎక్కి దిగే చోట చలువ పందిళ్ల్లు ఏర్పాటు చేశారు. వీటిని ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో చలువ పందిళ్లను పెంచాలని సూచించారు.


