పట్టించుకోవడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోవడం లేదు..

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

పాధి హామీ కూలి డబ్బులు ఖాతాల్లో జమ కాలేదు. చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పటించుకోవడం లేదు. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి హామీ కూలి డబ్బులు త్వరగా వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలి.

– సునీత, ఉపాధి కూలి, చంద్రశేఖర్‌నగర్‌

పైసలు వస్తలేవు..

నవరి నుంచి ఇప్పటి వరకు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాం. గడిచిన మూడు నెలలుగా కూలి పైసలు వస్తలేవు. ఎండల్లో పనులు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కూలి డబ్బులు ఇప్పించేలా చొరవ చూపాలి. – పురుషోత్తం, ఉపాధి కూలి, చెన్నిపాడు

బడ్జెట్‌ రాగానే..

పాధి హామీ కూలీలకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. ప్రభుత్వం నుంచి కూలి డబ్బులు వచ్చిన వెంటనే కూలీల ఖాతాల్లో జమ చేస్తాం. ప్రజలు ఉపాధి హామీ పథకం ద్వారా కల్పిస్తున్న కూలీ పనులను సద్వినియోగం చేసుకోవాలి.

– ముసాయిదాబేగం, డీఆర్‌డీఓ

Advertisement
 
Advertisement
Advertisement