పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

గద్వాల: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కుర్వపల్లయ్య ఆధ్వర్యంలో రైతులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం కురిసిన వడగండ్ల వానకు అయిజ, రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దీనిపై అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ నినాదాలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏఓ భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు రవికుమార్‌, కృష్ణ, వీరేష్‌, తిమ్మప్ప, వినయ్‌, వినోద్‌, లింగప్ప, మల్లేష్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement