‘ఉపాధి’కి విఘాతం | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి విఘాతం

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

మానవపాడు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం లక్ష్యం నీరుగారుతోంది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ బాధ్యరాహిత్యంతో చా లామందికి మూడు నెలలుగా కూలి డబ్బులు నిలిచిపోయాయి. రెక్కాడితే గానీ.. డొక్కాడని నిరుపేదలు, చెమట చిందించి చేసిన పనికి పైసలు రాక పోవడంతో అల్లాడిపోతున్నారు. మూడు నెలలుగా కూలి డబ్బులు అందక.. ఈకేవైసీ కొర్రీలతో కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్న పరిస్థితి వచ్చింది. మరోపక్క అధికారులేమో గ్రామాల్లో కనీసం వందమంది ఉపాధి హామీ పనులు కల్పించాలని సర్పంచ్‌లకు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే పనిచేసిన కూలీలకు డబ్బులు రాకపోతే పనులకు ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారం 15 రోజులలో కూలి డబ్బులు జమవ్వకపోతే రోజువారీగా లెక్కేసీ పరిహారం అందించాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం బ్యాంక్‌ అకౌంట్లు, ఆధార్‌ లింక్‌ అంశాలను అడ్డుపెట్టుకొని పథకం ఉద్దేశాన్ని నీరుగారుస్తుంది. ఉపాధి హామీ పనులు చేయించే ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సైతం మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు.

ముఖ ఆధారిత హాజరు..

కేంద్ర ప్రభుత్వం జాతీయ మొబైల్‌ పర్యవేక్షణ విధానం (ఎస్‌ఎంఎంఎస్‌) యాప్‌లో కూలీల ముఖ ఆధారిత హాజరు తీసుకున్నాకే పని కల్పించాల్సి ఉంటుంది. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మేటీలు యాప్‌లో కూలీల ఫొటో తీసినప్పుడు కూలీలు కనురెప్పలు మూసి తెరవాలి. ఇలా ఐదారు సార్లు చేయాల్సి ఉంటుంది. ఇదే తరహాలో అందరి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఉదయం 8 గంటలకు ఒకసారి ఫొటో దిగితే మళ్లీ 12 గంటలకు తీయాలి. ఒక గ్రామంలో వందమంది కూలీలు నాలుగు, ఐదు ప్రాంతాల్లో పని చేస్తున్నారంటే అన్నిచోట్ల వెళ్లి ఫీల్డ్‌ అసిస్టెంట్లు రెండుసార్లు అథెంటికేషన్‌ ఫొటోలు తీయాల్సిందే. లేకపోతే పని చేసిన డబ్బులు అకౌంట్లో జమ కావు. ఈ ఫొటో క్యాప్చర్‌ ప్రక్రియను యాప్‌ సరిగా గుర్తించకపోవడం టెక్నికల్‌ సమస్యలు, సిగ్నల్స్‌ సరిగా అందకపోవడంతో కూలీలు పనులకు దూరమవుతున్నారు.

మూడు నెలలుగా అందని కూలీల వేతనాలు

ఫీల్డ్‌ అసిస్టెంట్లదీ అదే పరిస్థితి

సకాలంలో చెల్లించకుండా

అధికారుల కాలయాపన

ఈకేవైసీ కొర్రీలతో పనులకు

వచ్చేందుకు అనాసక్తి

Advertisement
 
Advertisement
Advertisement