అయిజ: మున్సిపాలిటీలో శుక్రవారం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మున్సిపాలిటీలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్నిక కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ సురేష్ అధ్యక్షత వహించగా.. కమిషనర్ సైదులు ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను 13 మంది బీఆర్‌ఎస్ పార్టీ వారు ఉండగా.. 7మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. పోటీ లేకపోవడంతో మొత్తం నలుగురు బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికై న వారిలో నాగన్నగౌడ్ (జనరల్), సువర్ణ (జనరల్ మహిళ), మౌలా (మైనార్టీ), శంషాద్‌బేగం (మైనార్టీ మహిళ) ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు జ్యోతి, మహేశ్వరి, సరోజమ్మ, పద్మ, నర్సమ్మ, శారదాసువర్ణ, రామేశ్వరమ్మ, తిరుమలేష్, రజాక్‌షేక్, శివ, కృష్ణయ్య, మున్సిపల్ మేనేజనర్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


