అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం

Apr 24 2026 6:26 AM | Updated on Apr 24 2026 6:26 AM

ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను శోభాయమానంగా అలంకరించి.. వేదమంత్రాల నడుమ కల్యాణతంతు జరిపించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement