మొత్తం 4 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. 100 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 12 రోజువుతుంది. ఇప్పటి వరకు కాంటా వేయలేదు. మొక్కజొన్న రాశుల వద్ద కాపలా కాయలేక ఇబ్బందులు పడుతున్నాం. అనుకోకుండా వర్షం పడటంతో చాలామంది రైతుల మొక్కజొన్న తడిసిపోయింది. – మార్కు, రైతు,
ఉప్పల క్యాంపు, అయిజ మండలం
రాత్రంతా కాపలా..
మొత్తం 120 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 15 రోజులయ్యింది. రాత్రి సమయంలో పందులు సంచరిస్తున్నాయి. వాటిని పారదోలేందుకు రాత్రంతా కాపలా కాయాల్సి వస్తోంది. దీని వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. రైతులు తెచ్చిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేస్తే బాగుంటుంది. – ఈశ్వరన్న, రైతు,
తూంకుంట, అయిజ మండలం
బ్యాగులు తెచ్చుకోవాలంట
గన్నీ బ్యాగులు లేకపోవడంతో మొక్కజొన్న కాంటా వేసేందుకు ఆలస్యం అవుతుంది. రైతులే గన్నీ బ్యాగులు తెచ్చుకుంటే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క బ్యాగు ధర రూ.30. అధికారులు మాత్ర ఒక్కొక్క బ్యాగుకు రూ.15 చెల్లిస్తామంటున్నారు. ఒక్కొక్క బాగ్యుపై రైతు రూ.15 నష్టపోవాల్సి వస్తోంది. – అబ్రహం,
రైతు, తూంకుంట, అయిజ మండలం
ఎక్కడికక్కడే కొనుగోళ్లు చేపడుతున్నాం..
మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 13 చోట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశాం. జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు రైతుల తాకిడి ఎక్కువగా ఉంది. రైతులు సమీప ప్రాంతంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – తహమీనా,
జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి, నాగర్‌కర్నూల్
●


