క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలి

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: విద్యార్థులు క్రీడల్లోనూ ఉన్నత స్థాయికి ఎదగాలని పాలమూరు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ జి.ఎన్‌.శ్రీనివాస్‌ అన్నారు. ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా పీయూలో విద్యార్థులకు ఇంటర్‌ డిపార్ట్‌మెంటల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కబడ్డీ క్రీడలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. మనిషి ఆరోగ్యానికి క్రీడలు ఎంతో మేలు చేస్తాయని, నిరంతరం ఉత్తేజంగా పనిచేయడానికి సహకరిస్తాయన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్‌ పూస రమేష్‌బాబు, ఫిజికల్‌ డైరెక్టర్‌ డా.వై.శ్రీనివాసులు, సిబ్బంది అభిషేక్‌, శారద, మన్యం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement