ట్రాఫిక్‌ సిబ్బందికి చలువ కళ్లద్దాల అందజేత | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ సిబ్బందికి చలువ కళ్లద్దాల అందజేత

Apr 21 2026 4:38 AM | Updated on Apr 21 2026 4:38 AM

గద్వాల క్రైం: వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కంటి సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం ఉంద ని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో సిబ్బందికి చలువ కళ్లద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ని త్యం ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం, ప్రమాదాల నివారణకు శ్రమిస్తున్న సిబ్బంది సేవలు కీలకంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రాఫిక్‌ విధు లు నిర్వహించే సిబ్బంది ఎండలు తీవ్రరూపం దా ల్చడంతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంన్నారన్నారు. ముఖ్యంగా కంటి చూపుపై తీవ్ర ప్ర భావం చూపుతుందన్నారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ఎలాంటి అవాంతరాలు లేకుండా విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. కంటి సమస్యలు దరిచేరకుండా చలువ కళ్లద్దాలను అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ బాలచంద్రుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement