బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయం | - | Sakshi
Sakshi News home page

బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయం

Apr 21 2026 4:38 AM | Updated on Apr 21 2026 4:38 AM

గద్వాల: కుల, మత, లింగ బేధాలను తీవ్రంగా వ్యతిరేకించి సమాజంలో సీ్త్రలకు సమాన హక్కులు ఉండాలని నినదించిన బసవేశ్వరుడి బోధనలు, మార్గం అనుసరణీయమని అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు అన్నారు. విశ్వగురు బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి అధికారులు, వీరశైవ సంఘం నేతలు పూలమాల వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం ద్వారా కర్ణాటకకు చెందిన బసవన్న జీవితాన్ని తెలుగులో ప్రసిద్ధి చేశారన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి

జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను పట్టణ ప్రాంతాల్లో మరింత వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వివరిస్తూ జిల్లాలో ఇప్పటి వరకు 73.52 శాతం ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకరంతో బూత్‌స్థాయి అధికారులు మ్యాపింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, ఈ విషయంలో ఈఆర్‌ఓలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వం ఉద్యోగులు స్వచ్ఛందంగా మ్యాపింగ్‌ చేయించుకోవడం ద్వారా మిగిలిన వారికి మార్గదర్శకంగా నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరుల పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement