ఉదయం నుంచే..
జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
–8లో u
రోజురోజుకూ ఉష్ణోగ్రత లు పెరుగుతున్నాయి. ఎక్కువ ఎండలో తిరగడం ఏమాత్రం మంచిది కాదు. అత్యవసరమైతే జాగ్రత్తలతో బయటకు రావాలి. డీహైడ్రేషన్ కాకుండా తరచుగా నీరు తాగుతూ ఉండాలి. వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సేవల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. – సంధ్యకిరణ్మయి,
జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ
చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండలో ఎట్టి పరిస్థితుల్లోనూ బ యటికి తీసుకెళ్లొదు. ఆడు కోనివ్వద్దు. తరచుగా మంచినీటిని తాగించాలి. వడదెబ్బ తగిలినట్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి.
– దామ భరత్, చిన్నపిల్లల వైద్యుడు
గద్వాల క్రైం: కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. భరించలేనంత ఉక్కపోత.. వేడి సెగలకు బెంబేలెత్తున్నారు. బాబోయ్ ఎండలోనే ఉన్నామా.. లేక నిప్పుల కొలిమిలో ఉన్నామా అనే భవన కలుగుతోంది. చాలా వరకు ఎండ తీవ్రతను తట్టుకోలేక మధ్యాహ్నం 12 గంటలలోపు ఇంటిబాట పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు మరింత ఇబ్బంది పడుతున్నారు. తాజా పరిస్థితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 42 –44 డిగ్రీలకు చేరడంతో ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా..
తేదీ కనిష్టం గరిష్టం
13 41.6 24.7
14 42.8 25.8
15 42.7 24.9
16 42.8 25.6
17 43.1 25.4
18 43.6 25.2
19 44.1 25.0
రోజురోజుకు పెరుగుతున్న
ఎండల తీవ్రత
అల్లాడుతున్న చిన్నారులు, వృద్ధులు
ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
అప్రమత్తంగా
ఉండాలంటున్న వైద్యులు
ఉదయం నుంచే భానుడి భగభగ మొదలవుతోంది. 10 నుంచి 11 గంటల వరకే 30 – 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల దాకా ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఇక సాయంత్రం 7గంటలైనా వేడి సెగలు తగ్గడం లేదు. జిల్లాలో సాధారణంగా వేసవి ఉష్ణోగ్రతలు గరిష్టంగానే ఉంటాయి. అయితే ఏప్రిల్‌లోనే 42 –44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వచ్చే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.


