పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

చమన్‌ఖాన్‌దొడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌

● ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు చమన్‌ఖాన్‌దొడ్డిలో ఎక్కడ చూసినా తాటాకు గుడిసెలు ఉండేవని, గుడిసెల స్థానంలో ప్రస్తుతం ఇందిరమ్మ పక్కా ఇళ్లు వచ్చాయని పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లే పరిస్థితులు రూపుమాపి, ప్రజలు తమ సొంత కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సీఎస్‌ఆర్‌సీ, భవిష్యత్‌ భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన డిజిటల్‌ సేవల భవనాన్ని కలెక్టర్‌, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. కార్యక్రమంలో గద్వాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హన్మంతు, సర్పంచు భీమయ్య, ఉపసర్పంచు రేణుక, హౌసింగ్‌ డీఈ కాశీనాథ్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీఓ చెన్నయ్య, నాయకులు రామన్‌గౌడ్‌, విజయ్‌కుమార్‌, రాముడు తదితరులు పాల్గొన్నారు.

గట్టు: ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. శనివారం మండలంలోని చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులంతా ఒకేసారి గృహ ప్రవేశాలు చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. పేదల సొంతింటి కల నెర్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు. గ్రామంలో ప్రతి ఇంటి ముందు మరుగుదొడ్డి నిర్మించుకుని ఉపయోగించుకోవాలని కోరారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు.

లైవ్లీహుడ్‌ ఇంక్లూజివ్‌కు ఎంపిక..

లైవ్లీహుడ్‌ ఇంక్లూజివ్‌ ప్రోగ్రాంకు గట్టు మండలాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ పథకం ద్వారా మండలంలోని 15 గ్రామాలను ఎంపిక చేసి, ఒక్కొక్క గ్రామంలో 25 కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సమన్వయకర్తల సహకారంతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. బీపీ, షుగర్‌ వ్యాధులు పెరుగుతున్నాయని, ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రులను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం గర్భిణులు, బాలింతల సేవలు, పిల్లల బరువు నమోదు, పౌష్టికాహారం పంపిణీ గురించి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement