కురుమూర్తిస్వామి సేవ కోసం అమ్మాపురంలో మకాం | - | Sakshi
Sakshi News home page

కురుమూర్తిస్వామి సేవ కోసం అమ్మాపురంలో మకాం

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

కురుమూర్తిస్వామి సేవ కోసం అమ్మాపురంలో మకాం భర్త పేరు మీద గోపాల్‌పేట సంస్థానం

గోపాల్‌పేట: గోపాల్‌పేట సంస్థానం 19వ శతాబ్దంలో ఏర్పాటైంది. గోపాల్‌పేట సంస్థానం రాణి రంగనాయకమ్మ తన భర్త గోపాల్‌రావు పేరుమీద గోపాల్‌పేట అనే పేరు పెట్టారు. ఇక్కడి సంస్థానంతో వనపర్తి సంస్థానాధీశులకు సంబంధాలు ఉండేవని చరిత్రకారులు చెబుతారు. గోపాల్‌పేట సంస్థానం పరిధిలో 12 గ్రామాలు ఉండగా.. రాణి రంగనాయకమ్మ గ్రామంలో వేలాది మందికి అన్నదానాలు చేసేవారు.

చిన్నచింతకుంట: అమ్మాపురం అమరచింత, ఆత్మకూర్‌ సంస్థానాల పాలన కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చ.కి.మీ., విస్తీర్ణంలో కలిగి ఉన్న అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల కాలం వరకు ముక్కెర వంశీయులు పరిపాలించారు. ఇది 19వ శతాబ్దంలో భారత యూనియన్‌లో విలీనమైంది. కురుమూర్తి స్వామి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీద్‌తో పా టు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement