గద్వాల క్రైం: రోడ్డు నిబంధనలు, వాహన ప్రమాదాలు నివారించేందుకు అవగాహన కల్పించడంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ పేరిట భద్రత కార్యాక్రమాలు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం గద్వాల మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎదురుచూస్తున్న మీ కుటుంబ సభ్యుల కోసం రోడ్డుపై జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి సురక్షితంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల జరిగే నష్టం కుటుంబ వ్యవస్థ ఛిద్రం చేస్తుందని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షత్రగాతులను రక్షించేందుకు గోల్డెన్ అవర్ ఎంతో కీలకమన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రథమ చికిత్సతో పాటు అందుబాటులో ఉన్న వైద్యుల వద్దకు సకాలంలో తీసుకేళ్తే క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్యాష్‌లెస్ స్కీంలో భాగంగా గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించిన వారికి రూ.25వేల నగదు అందుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ శ్రీను, ఎస్‌ఐ శ్రీకాంత్, బాల చంద్రుడు, వైద్యులు తదితరులు ఉన్నారు.


