డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాడుదాం | - | Sakshi
Sakshi News home page

డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాడుదాం

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

గద్వాల న్యూటౌన్‌: పెండింగ్‌ బిల్లుల విడుదల, పీఆర్సీ, హెల్త్‌కార్డుల అమలు, సీపీఎస్‌ రద్దుతో పాటు, మరో 62 డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ టీజీఈజేసీ ఆధ్వర్యంలో కార్యాచరణను రూపొందించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల గెజిటెడ్‌ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీజీఈజేసీ గద్వాల జిల్లా శాఖ చైర్మన్‌ నాగార్జునగౌడ్‌, కోచైర్మన్‌ తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 30 నెలలు గడిచిన నేపథ్యంలో ఉద్యోగులకు 51శాతం ఫిట్‌మెంట్‌తో 2వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడగించరాదని, నివేదికను జూన్‌ 2 లోపు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ బిల్లులు నెలకు రూ.700 కోట్లు విడుదల చేసినప్పట్టికీ, రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్డ్‌ అవుతున్నందున బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న రూ.13 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్‌ నరసింగరావుకు అందజేశారు. కార్యక్రమంలో టీజీఈజేసీ నాయకులు బీజాపూర్‌ ఆనంద్‌, వెంకటరాజారెడ్డి, లక్ష్మారెడ్డి, వేణుగోపాల్‌, లక్ష్మణ్‌, యూనుస్‌ బాషా, బుచ్చన్న, ఆర్‌.మోహన్‌, నాగరాజు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement