రోగులకు మెరుగైన సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన సేవలు అందించాలి

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

అయిజ: రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది పీహెచ్‌సీలో అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సంధ్య కిరణ్మయి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం డీఎంహెచ్‌ఓ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నవీన్‌ క్రాంతితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ, సదుపాయాలు, రోగులకు అందుతున్న వైద్యం, మందుల పంపిణీ గురించి పీహెచ్‌సీ డాక్టర్లు రామలింగారెడ్డి, కిరణ్‌, ఎంపీహెచ్‌ఈఓ ఓబులేష్‌ను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా 5 పడకల డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సదుపాయాలను పరిశీలించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన 30 పడకల ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. కలెక్టర్‌కు సమస్యను వివరించి, 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పనులు పూర్తిచేయించాలని కోరుతామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement