నీరుపయోగమేనా? | - | Sakshi
Sakshi News home page

నీరుపయోగమేనా?

Apr 16 2026 12:41 PM | Updated on Apr 16 2026 12:41 PM

28వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు.. ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. పనులు పూర్తిచేయాలి.. త్వరలోనే పూర్తిచేస్తాం..

20ఏళ్లు గడిచినా పూర్తికాని పనులు

డీజిల్‌ ఇంజిన్లతో పంటలకు సాగునీరు

రైతులకు తడిసిమోపెడవుతున్న

పెట్టుబడి ఖర్చులు

అసంపూర్తిగా ముచ్చోనిపల్లి రిజర్వాయర్‌ కాల్వలు

అయిజ: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ముచ్చోనిపల్లి రిజర్వాయర్‌ కాల్వల పనులు నత్తనడకన సాగుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా కాల్వల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందని ద్రాక్షగా మారింది. ముచ్చోనిపల్లి జలాశయం ద్వారా అయిజ మండలంలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 20 ఏళ్ల క్రితం కాల్వల నిర్మాణ పనులు చేపట్టగా.. నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో వచ్చే కొద్దిపాటి నీటిని రైతులు ఇంజిన్ల ద్వారా పంట పొలాలకు పారించాల్సిన దుస్థితి నెలకొంది. పంటలకు పూర్తి నీటితడులు లేక దిగుబడులు రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

సంవత్సరాల తరబడి..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2006లో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 109 ప్యాకేజీ కింద గట్టు మండలం ముచ్చోనిపల్లి శివారులో రూ. 38.25 కోట్ల వ్యయంతో 1.634 టీఎంసీల సామర్థ్యం గల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించారు. దీంతో సుమారు 2,500 ఎకరాల భూములు ముంపునకు గురయ్యాయి. రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత 16వేల ఎకరాలకు సరిపడా నీటిని నిల్వ ఉంచుతున్నారు. అయితే 107వ ప్యాకేజీ కింద ర్యాలంపాడు వద్ద ఏర్పాటుచేసిన ఎత్తిపోతల నుంచి మెయిన్‌ కెనాల్‌ ద్వారా 38వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అనుకోని పరిస్థితుల్లో మెయిన్‌ కెనాల్‌ నుంచి పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో అధికారులు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ద్వారా నీరందించేందుకు మైనర్‌ కెనాల్స్‌ నిర్మాణ పనులు చేపట్టగా.. సంవత్సరాల తరబడి అసంపూర్తిగానే ఉన్నాయి.

ముచ్చోనిపల్లి రిజర్వాయర్‌ ద్వారా 107 ప్యాకేజీ కింద 38వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. కేవలం 28 వేల ఎకరాలకు మాత్రమే నామమాత్రంగా నీరందుతోంది. మరో 10వేల ఎకరాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్‌ కింద ఫీటు కాల్వల నిర్మాణ పనులను ఇప్పటికీ ప్రారంభించలేదు. దీంతో రైతు లు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాల్వలు తవ్వినా నీరు ముందుకు పారని పరిస్థితి ఉంది. రైతులు డీజిల్‌ ఇంజిన్లు ఏర్పా టు చేసుకొని పంటపొలాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి కాల్వల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ ను ంచి పంటపొలాల కు సాగునీరు వస్తుందని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాం. ము చ్చో నిపల్లి రిజర్వాయర్‌లో నీరు ఉన్నా లాభం లేకుండా పోయింది. పంటపొలాల్లో కాల్వలు తవ్వి అసంపూర్తి గా వదిలేశారు. కాల్వలు తవ్వకుండా ఉ న్నా ఆ స్థలంలో పంటలు పండించుకునే వాళ్లం.

– లింగన్న, రైతు, అయిజ

పంటపొలాల్లో కాల్వ లు ఉన్న రైతులు ఏదో రకంగా నీటిని వినియోగించుకుంటున్నారు. కాల్వలకు దూరంగా భూములు ఉన్న వారి పరిస్థితి దీనంగా ఉంది. వచ్చే వర్షాకాలం నాటికై నా కాల్వ పనులు పూర్తిచేసి.. సాగునీటిని అందించాలి.

– గోవిందు, రైతు, ఎక్లాస్‌పురం

ముచ్చోనిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి 107 ప్యాకేజీ కింద పెండింగ్‌లో ఉన్న కాల్వ ల నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు మ రో కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాం. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ద్వారా కాల్వల్లో ముళ్లపొదల తొలగింపు, పూడిక తీసేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే ఉపాధిహామీ పథకం ద్వారా కొన్ని పనులు చేపట్టాం. వీలైనంత వరకు పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం.

– సంజీవ్‌ ప్రసాద్‌,

ఈఈ, 107వ ప్యాకేజీ

Advertisement
 
Advertisement
Advertisement