అలంపూర్: క్రమశిక్షణతో రోడ్డు నిబంధనలు పాటి స్తేనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అలంపూర్ మాంటిస్సోరి పాఠశాలలో బుధవారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం, సీట్ బెల్టు ధరించే విధానం, జీబ్రా క్రాసింగ్ వంటి అంశాలపై డెమో ద్వారా వి ద్యార్థులకు వివరించారు. అనంతరం ఆరైవ్.. అలైవ్ సందేశంతో విద్యార్థులు మానవహారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ద్వి చక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం బాధ్యత గా భావించాలన్నారు. భావిభారత పౌరులైన విద్యార్థులకు రోడ్డు భద్రతపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తనతో పాటు ఇతరులు ఎవరికీ ప్రమాదం జరగకూడదనే ఆలోచన ఉండాలని తెలిపారు. ప్రపంచం అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తుండగా.. రహదారి భద్రతపై చాలా మందికి అవగాహ న లేక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. విద్యార్థులే కుటుంబాల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. కుటుంబ సభ్యులు బైక్‌పై బయట కు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. ఎంవీఐ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి ప్రయాణం భద్రంగా సాగాలన్నారు. అందుకోసం రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూ చించారు. డీఎస్పీ మొగిలయ్య మాట్లాడుతూ.. మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు ఉంటాయన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే రూ. 25 వేల జరిమానాతో పాటు తల్లిదండ్రులకు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపొద్దన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రదీప్‌కుమార్, ఎంపీడీఓ పద్మావతి, ఎంఈఓ అశోక్ కుమార్, స్కూల్ కరస్పాండెంట్ రవిప్రకాశ్ పాల్గొన్నారు.


