కంపెనీల నుంచి శుద్ధి చేయకుండా బయటకు వదిలే రసాయనాలు కలిసిన నీరు మూలంగా పంటలు పండవని.. ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావని అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్ అధికారులు ఎప్పుడో తేల్చారు. మా బోర్లు, భూములు పరిశీలించి.. టెస్టులు చేసి.. సర్టిఫికెట్లు ఇచ్చారు. మేం ఊరి వదిలిపెట్టి పోవాల్నా.. లేకుంటే ఏమైనా తాగి సావాల్నా అర్థమైతలేదు. కాలుష్యపు నీళ్లు వదిలే కంపెనీలపై చర్యలు తీసుకుని.. పరిహారం ఇప్పించాలి. మాలాంటి రైతులందరికీ తగిన న్యాయం చేయాలి. – ముల్గర నారాయణగౌడ్, రైతు, ముదిరెడ్డిపల్లి


