గద్వాల: దేశంలోని బడుగు, బలహీన, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీ మల్లురవి, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లనే కారణమని కొనియాడారు. రాజ్యాంగంపై అవగాహన కోసం స్వయంగా 30 వేల రాజ్యాంగ ముఖ్యాంశాలు పుస్తకాలను ముద్రింపజేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలోని అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, మున్సిపల్ చైర్మన్ జయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, తహసీల్దార్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


