అలంపూర్‌ అభివృద్ధికి సహకరించండి | - | Sakshi
Sakshi News home page

అలంపూర్‌ అభివృద్ధికి సహకరించండి

Apr 15 2026 8:14 AM | Updated on Apr 15 2026 8:14 AM

అలంపూర్‌: అలంపూర్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో ఎంపీ మల్లురవికి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, అలంపూర్‌ పట్టణ అధ్యక్షుడు నర్సింహ తదితరులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అలంపూర్‌ పట్టణానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని వినతిలో కోరినట్లు వారు చెప్పారు. స్థానికంగా ఇంటర్‌ కళాశాల మాత్రమే ఉండటంతో ఉన్న త విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థి తి నెలకొందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థులు డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఉన్నత చదువులకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం స్థానికంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల ని విన్నవించారు. నియోజకవర్గ కేంద్రంలో గ్యాస్‌ ఏజెన్సీ కేంద్రం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గ్యాస్‌ కోసం అలంపూర్‌ చౌరస్తాకు వెళ్లాల్సి వస్తుందని వివరించారు. అక్కడికి వెళ్లిన సకాలంలో గ్యాస్‌ లభిస్తుందనే నమ్మకం లేదని, దీంతో పట్టణంతోపాటు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోని గ్యాస్‌ ఏజెన్సీ కేంద్రం ఏర్పాటు చేయాలని, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతిలో కోరారు. సానుకులంగా స్పందించిన ఎంపీ గ్యాస్‌ ఏజెన్సీ ఏ ర్పాటుకు ఉన్నతాధికారులతో మాట్లాడతానని హా మీ ఇచ్చారన్నారు. డిగ్రీ కళాశాల అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమవంతుగా కృషి చేస్తానన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు సుందర్‌రాజు, జాన్‌, సుంకన్న తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement