అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగించాలి

Apr 15 2026 8:14 AM | Updated on Apr 15 2026 8:14 AM

అంబేడ్కర్‌ ఆశయాలు కొనసాగించాలి

ఇటిక్యాల: రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం అహర్నిషలు కృషిచేసిన అంబేడ్కర్‌ ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని పదవ పటాలం కమాండెంట్‌ జయరాజు అన్నారు. పటాలంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. దేశంలో అంటరానితనం, దళితుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి వారికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారన్నారు. ప్రతిఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి ఆశయాలను కొనసాగించాలని కోరారు. అలాగే మండలంలోని కొండేరులో నిర్వహించిన కార్యక్రమానికి కమాండెంట్‌ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్లు ధర్మారావు, నర్సింహరాజు, రాజేశం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement