ఫిర్యాదులు పరిష్కరించని అధికారులపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు పరిష్కరించని అధికారులపై చర్యలు

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

గద్వాల: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన తీసుకుంటానని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో 103 ఫిర్యాదులు స్వీకరించి.. సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు పేర్కొంటూ ఫిర్యాదుదారు నికి అక్‌నాలెడ్జ్‌మెంట్‌ను పంపాలన్నారు. అలాగే మండలాల్లో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తే చిన్నచిన్న సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. అధికార యంత్రాంగం చి త్తశుద్ధితో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా పాత ఫై ల్స్‌ క్లియరెన్స్‌, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నా కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వసతి గృహాలను తరచుగా సందర్శించాలన్నారు. మంగళవారం నుంచి ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement