గద్వాల క్రైం: ప్రజలు నాణ్యమైన ఆహారం తీసుకొని.. ఆరోగ్యకరమైన జీవనం అవలంబించాల ని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. సోమ వారం ఫుడ్ సేఫ్టీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లా డారు. ఆహారం విషయంలో ప్రతిఒక్కరు నాణ్య త కలిగిన వంట సరుకులు కొనుగోలు చేసుకుని రుచికరమైన ఇంటి భోజనం తీసుకోవాలన్నారు. బయటి మార్కెట్‌లలోని హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, దాబాలలో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం బారినపడాల్సి వస్తుందని హె చ్చరించారు. నాణ్యమైన వంట సరుకులు మార్కెట్‌లలో వినియోగదారులు కొనుగోలు చేసే క్రమంలో ప్రభుత్వం గుర్తించిన కంపెనీల దినుసులు, సరుకులు తీసుకోవాలన్నారు. కల్తీ ఆహార ధాన్యం, ఇతరత్రా సరుకుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల వివిధ రకాల రోగాలబారిన పడాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి డీఎంహె చ్‌ఓ సంధ్యాకిరణ్మయి, సిబ్బంది పాల్గొన్నారు.


