గద్వాల: ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని డీకే బంగ్లాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్ సంఘ్ నుంచి 1980 ఏప్రిల్ 6వ తేదీన శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిందన్నారు. మొదట ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ ప్రస్తుతం మూడోసారి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిందన్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రాయాస్ అనే నినాదంతో 2047నే లక్ష్యంగా సాగుతూ ముందుకెళ్తుందన్నారు.


