గద్వాల: జిల్లాలో పదో తరగతి పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పలు పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు తదితర వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు అనుమతించరాదన్నారు. ప్రశ్నాపత్రాలను పోలీస్ ఎస్కార్ట్‌తోనే కేంద్రాలకు తరలించాలన్నారు. అదేవిధంగా జవాబు పత్రాలను స్థానిక తపాలా కార్యాలయంలో డిపాజిట్ చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.
చదువుతోనే
సమాజంలో గౌరవం
వనపర్తిటౌన్: చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని.. చదువు లేదంటే రాజకీయాల్లో మాదిగలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డా. కదిరె కృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగ ప్రజాప్రతినిధుల సన్మానసభకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై జిల్లాలోని మాదిగ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించి మాట్లాడారు. మాదిగలు చరిత్రలో మొదటి కళాకారులని.. జాతి అభివృద్ధే లక్ష్యమని, విద్యావంతులు, జ్ఞానవంతులు మాదిగ యువతను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మాదిగలు ఎదగాలని.. పిల్లల్ని వైద్యులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులుగా తయారు చేయాలని, అప్పుడే సమాజంలో గౌరవంగా జీవించగలరని చెప్పారు. చదువును నిర్లక్ష్యం చేయొద్దని, చదువుతోనే ఏదైన సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజాప్రతినిధులు పదవి కాలంలో సమస్యల పరిష్కారానికి శ్రమించి అభివృద్ధి చేయాలని సూచించా రు. మాదిగల ఐక్యవేదిక సభ్యులు పెద్దింటి వెంకటేష్, గంధం పరంజ్యోతి, రాములు, మీసాల రాము, తిరుపతి, రవి, నాగరాజు, రాజేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.


