పారదర్శకంగా నిరుపేదల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా నిరుపేదల గుర్తింపు

Mar 29 2026 7:04 AM | Updated on Mar 29 2026 7:04 AM

గట్టు: సమాజంలో అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీలలో ఉన్న అత్యంత నిరుపేదలను గుర్తించడంలో సీఆర్‌పీలు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని సెర్ప్‌ స్టేట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ రవీంద్రరావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని పెంచికలపాడు, మాచర్ల, తప్పెట్లమొర్సు, గంగిమాన్‌దొడ్డి గ్రామాల్లో పర్యటించి.. సర్పంచులు, వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు మండలంలోని 17 గ్రామాలను సర్వే కోసం ఎంపిక చేశామని, మొదటి విడతగా 5 గ్రామాల్లో సర్వే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి, వారికి ప్రభుత్వ సహాయం అందేలా చూడడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని పేర్కోన్నారు. అనంతరం మండల సమాఖ్య భవనంలో ఆదివారం నిర్వహించే ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను వీఓఏలకు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, ఎంపీడీఓ చెన్నయ్య, మండల సమాఖ్య సభ్యురాలు వెంకటేశ్వరి, ఏపీఎం మారుతి, సీసీలు శేఖర్‌, జ్యోతి, తిమ్మక్క, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement