
18న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
పెంట్లవెల్లి: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామంలో 22 ఎకరాలలో నిర్మించనున్న రెసిడెన్షియల్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగసభ నిర్వహించనున్నారు. కాగా.. సోమవారం నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ హెలీప్యాడ్, సభావేదిక, పార్కింగ్ వంటి స్థలాలను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. సమయం లేనందున అధికారులు క్షేత్రస్థాయిలో దగ్గరుండి మూడు రోజుల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయా లని ఆదేశించారు. అసంపూర్తి పనులు మరింత ముమ్మరం చేయాలని జిల్లాస్థాయి అధికారుల కు సూచించారు. మంగళవారం మంత్రి జూ పల్లి కృష్ణారావు స్థల పరిశీలన చేస్తారని, ఆలో గా పనులు కొలిక్కి వచ్చేలా చూడాలన్నారు. సభావేదిక ఏర్పాట్లు, ఇతర పనుల్లో ఎలాంటి అలసత్యం వహించరాదని చెప్పారు.