మైనార్టీల హక్కులు కాలరాస్తున్న కేంద్రం | - | Sakshi
Sakshi News home page

మైనార్టీల హక్కులు కాలరాస్తున్న కేంద్రం

Jul 14 2025 5:19 AM | Updated on Jul 14 2025 5:19 AM

మైనార్టీల హక్కులు కాలరాస్తున్న కేంద్రం

మైనార్టీల హక్కులు కాలరాస్తున్న కేంద్రం

గద్వాలటౌన్‌: ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని, ఆ దిశగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో పాలన సాగుతుందని మాజీ ఎంపీ సుభాషిణి అలీ విమర్శించారు. ఆవాజ్‌ రాష్ట్ర మూడో మహాసభ ఆదివారం ప్రారంభమైంది. అంతకుముందు పట్టణంలో ముస్లిం మైనార్టీలు, వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక తేరుమైదానంలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. బీజేపీకి భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని ధ్వజమెత్తారు. అందుకోసమే రాజ్యాంగం అమలులో నిర్లక్ష్యం కనిపిస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమల్లోకి తీసుకొచ్చే కుట్ర చేస్తుందని ఆరోపించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టం వల్ల మైనార్టీ హక్కులకు భంగం కలిగిందని, అందుకే పరదచాటున ఉన్న ముస్లిం మహిళలు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని వివరించారు. మైనార్టీల దేశభక్తిని ఎవరు గుర్తుంచాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాతంత్ర హక్కులను హరిస్తే తిరగబడుతామని హెచ్చరించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌ తదితర రాష్ట్రాలలో ఆడ పిల్లలపై జరుగుతున్న అరాచకాలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కులాలు, మతాలు, జాతుల మధ్య విభజన వాదాన్ని స్పష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందుతున్న బీజేపీ ఆలోచన విధానాలను ప్రజలు తెలుసుకోవాలన్నారు.

ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు..

ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌ మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని ఆరోపించారు. ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ సరిత మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను విద్య, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ముస్లిం మైనార్టీ రిజరేషన్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ రియాజ్‌ మాట్లాడుతూ దేశంలో లౌకిక విలువల పరిరక్షణకు, ప్రజల మధ్య ఐక్యత పెంచడం కోసం ఆవాజ్‌ రాష్ట్ర మహాసభలు జరగాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు జబ్బార్‌, అతికూర్‌ రెహమాన్‌, నీలి శ్రీనివాసులు, వెంకటస్వామి, మధుసూదన్‌బాబు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, ప్రభాకర్‌, ఇసాక్‌, ఇక్బాల్‌పాష, పల్లయ్య, గంజిపేటరాజు, నర్సింహా, తాహేర్‌, మోహన్‌, రహీమతుల్లా తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ సుభాషిణి అలీ

ఆవాజ్‌ రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement