
‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా’
అలంపూర్: ప్రజా సంక్షమమే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అయిజ, రాజోళి, వడ్డేపల్లి, ఇటిక్యాల, ఉండవెల్లి మండలాలకు చెందిన 289 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడానికి తన వంతుగా కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గజేందర్‌రెడ్డి, నాయకులు బాలకృష్ణారెడ్డి, దేవన్న తదితరులు ఉన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కులు..
కర్నూల్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే విజయుడు గురువారం పంపిణీ చేశారు. ఇటిక్యాల మండలంలోని ఉందడాపురం గ్రామానికి చెందిన హరిజన ప్రకాశం కు రూ.15 వేలు, హరిజన శంకరన్నకు రూ.16,500, అయిజ మున్సిపాలిటీకి చెందిన మాల దాసరి తిమ్మప్పకు రూ.23,500 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందించారు.