
బోధనా సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపే లక్ష్యం
గద్వాలటౌన్ : మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా భోధన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అన్నిస్థాయిల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను చేపట్టిందని జిల్లా విద్యా సమన్వయ అధికారిణి ఎస్తేరురాణి అన్నారు. మంగళవారం వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు వేరువేరుగా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వారికి ఆయా సబ్జెక్టుల నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన ఫలితాలను పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్లు బీకే రమేష్, అమీర్‌బాష, వెంకటనర్సయ్య, అంపయ్య తదితరులు పాల్గొన్నారు.