
ఎప్‌సెట్‌లో ‘గట్టు’ గురుకుల విద్యార్థినుల ప్రతిభ
గట్టు: ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాల్లో గట్టు గురుకుల కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. ఆదివారం ఫలితాలను విడుదల చేయగా.. గట్టు విద్యార్థినులు స్వాతి 369వ ర్యాంకు, ఐశ్వర్య 981వ ర్యాంకు మణికుమారి 1106 ర్యాంకు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. వీరితోపాటు ఇదే కళాశాలకు చెందిన మరికొందరు సైతం 10 వేల లోపు ర్యాంకులను సాధించినట్లు తెలిపారు. విద్యార్థినులు ప్రతిభ కనబర్చడంపై ప్రిన్సిపాల్‌తోపాటు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.